Tantralu

“హతాజోడి”

గరుడ ముక్కు అనగా ఒక ఔషధ మొక్క. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం మార్టీనియా ఆన్యువా (Martynia Annua). దక్షిణ భారత దేశంలో ఉన్న ఎజెన్సీ నేలల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. పంజాబీహిందీ భాషల్లో ఈ మొక్కను హతజోరి లేక హతజోడి అని అందురు. సంస్కృతంలో ఈ మొక్కను కాకంగి, కకనస అనే పేర్లతో పిలుస్తారు.

ఈ మొక్క ఆకుల రసం మూర్ఛ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకుల రసం నిద్రలేమికి, క్షయ, బొంగురు గొంతుకు, విషపురుగుల కాటుకు, గండమాలకు ఉపయోగపడుతుంది  2. విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టుకుదురదలకు, చర్మవ్యాధులకు వాడవచ్చును

ఇతర విషయాలు

మధ్యప్రదేశ్ ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఈ మొక్క కాండాన్ని తాంత్రిక, వశీకరణ చర్యలకు వాడుదురు. ఈ మొక్క కాండాన్ని కలిగి ఉంటే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయని, చాముండేశ్వరీ దేవి స్వరూపమని, అది ఇంట్లో ఉంటే అదృష్టమని కొందరు భావిస్తారు. అలాగే తాంత్రికులు ఈ మొక్క వేరుని రెండు చేతులు నమస్కారం పెట్టినట్లుగా తయారుచేసి మార్కెట్టులో “హతాజోడి” అనే పేరుతో అమ్ముతారు.